న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన సందర్భంగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను తమ అధినేత్రి సోనియాగాంధీ నిలుపుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సోనియాకు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారనిస్పష్టం చేశారు.




