Wednesday, 4 November 2026

మనమంతా భారతీయులం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రుల సంరక్షణ బాధ్యత లంఎగాణ ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. మొదట మనమంతా భారతీయులం, తర్వాతే సీమాంధ్ర, తెలంగాణ ప్రజలం ని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనతో తెలంగాణ ప్రజాప్రతినిధుల బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి నేతలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నేటి విజయం తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *