Tuesday, 3 November 2026

జయహో తెలంగాణ

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎందరో అమరుల త్యాగఫలం
తెలంగాణ కల సాకారం
37 సవరణలపై ఓటింగ్‌
29వ రాష్ట్రంగా తెలంగాణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సభ జై కొట్టింది. మంగళవారం తెలంగాణ బిల్లును సభ ఆమోదించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో సీమాంధ్ర వలస పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి అసువులు బాసిన ఎందరో అమరుల త్యాగానికి ఫలితం దక్కింది. తెలంగాణ కల సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించనుంది. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. కలసిపోయిన నాటినుంచి విడిపోవాలన్న తెలంగాణ ప్రజల కల నెరవేరింది. బౌగోళిక తెలంగాణ గమ్యాన్ని ముద్దాడింది. రాష్ట్ర పునర్విభజన బిల్లును లోకసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మంగళవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సభలో బిల్లుపై చర్చకు తెలేపినా చివరకు కేవలం 23 నిముషాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర పడింది. మూడుసార్లు వాయిదా అనంతరం నాలుగోసారి 3గంటలకు సభ ప్రారంభం కాగానే బిల్లు ఆవశ్యకతను, నేపథ్యాన్ని ¬ంమంత్రి షిండే వివరించారు. ఈ దశలోనే లోక్‌సభ ప్రసారాలను నిలిపివేశారు. అనంతరం భారతీయ జనతాపార్టీ సంపూర్ణ మద్దతు తెలపడంతో తెలంగాణ ప్రజల కల నెరవేరింది. సభలో బిల్లుపై ముగ్గరు సభ్యులు మాట్లాడారు. సుశీల్‌కుమార్‌ షిండే, సుష్మాస్వరాజ్‌, జైపాల్‌రెడ్డి బిల్లుపై మాట్లాడారు. మొత్తం 23 నిమిషాల్లో చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభ మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి ప్రారంభమయింది. ఏపీ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుకు నిరసనగా సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభలో కేంద్ర ¬ంమంత్రి షిండే మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌ విభజన అనంతరం వచ్చే పరిణామాలపై అధ్యయనం చేశామని, భాగస్వాములందరికీ తగినంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేశామని షిండే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై తన ప్రసంగాన్ని సుశీల్‌కుమార్‌ షిండే కొనసాగించారు. గందరగోళం మధ్యే చర్చను ¬ంమంత్రి కొనసాగించారు. అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సుశీల్‌కుమార్‌ షిండే హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటేస్తామని లోక్‌సభలో ప్రతిపక్షనేత , భాజపా నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సుశీల్‌కుమార్‌ షిండే ప్రసంగం అనంతరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. సుష్మాస్వరాజ్‌ పది నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని సుష్మా ప్రకటించారు. సీమాంధ్రులకు అన్యాయం జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెప్పారు. ఆక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక, నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆ తరవాత రాష్ట్రపతి ఆమోదంతో విభజన అంకం పూర్తవుతుంది. తెలంగాణ ప్రజలకు మంగళవారం చారిత్రకమైన రోజు కాబోతుంది. ఎన్నో ఏళ్ల విభజన డిమాండ్‌ నేపథ్యంలో దానికి ఓ ఆకృతి రాబోతున్న తరుణం. చర్చోపచర్చలు, అఖిలపక్షాలు, కమిషన్‌లు, అసెంబ్లీకి బల్లు ఇలా అన్ని అవాంతరాలను దాటుకుని 13న లోక్‌సభలో ప్రవేశించిన బిల్లుకు ఎట్టకేలకు చర్చ వరకు వచ్చింది. మంగళవారం చర్చను ¬ంమంత్రి షిండే ప్రారంభించడం, విపక్ష సుష్మాస్వరాజ్‌ ఆమోదంతో బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. దీంతో ఇక తెలంగాణకల సాకారం కాబోతున్నది. అమరుల ఆత్మత్యాగాలు ఫలించబోతున్నాయి. ఇదే మంగళవారం శుభ మంగళవారంగా చరిత్రలో నిలిచిపోనుంది. చర్చ జరక్కుంటే మూజువాణి ఓటుతో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసినట్లుగానే సీమాంధ్ర మంత్రులు, ఎంపీల నిరసనల మధ్య బిల్లును గట్టెక్కించారు. ఉదయం నుంచి లోక్‌సభ పలుమార్లు ఆటంకాలు రావడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. వరుసగా మూడుసార్లు సభ వాయిదా పడింది. మొత్తానికి బిల్లుపై చర్చను ¬ంమంత్రి షిండే ప్రారంభించారు. వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తొలిసారిగా సీపీఎం సభ్యులు కూడా స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. మరోవైపు తమిళజాలర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఏఐడీఎంకే సభ్యులు, పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించాలని కోరుతూ వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు వెల్‌లోకి వచ్చిన ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం మధ్య స్పీకర్‌ విూరాకుమార్‌ లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం ప్రారంభం నుంచి లోక్‌సభ మంగళవారం కూడా ఆందోళనలతో అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందినట్లు స్పీకర్‌ సభలో ప్రకటించారు. సభ ఆర్డర్‌లో లేకపోవడంతో నోటీసును అనుమతించడంలేదని చెప్పారు. సభ్యుల ఆందోళన మధ్యే కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లును చర్చకు అనుమతించాలని స్పీకర్‌ విూరాకుమార్‌ను కోరారు. 3గంటలకు సభ ప్రారంభం కాగానే మూజువాణి ఓటుతో 23 నిముషాల్లో ముగించారు. ఆ తరవాత చర్చ కొనసాగించి ప్రభుత్వం సూచించిన 37 సవరణకు కూడా లోక్‌సభ ఆమోదించింది. వాయిదా అనంతరం 3గంటలకు కూడా సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌ విభజనకు తాము వ్యతిరేకమని సామాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని తెలిపారు. రాష్ట్రాల విభజనకు సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకమని, ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. ఇదిలావుంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు సహకరిస్తామని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.
ఢిల్లీలో హైల అలర్ట్‌ ప్రకటించిన పోలీసులు
లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు హై అలర్టును ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం కోసం ఇప్పటికే ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. వీరంతా నేడు ఏపీభవన్‌, జంతర్‌మంతర్‌, పార్లమెంట్‌ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో అధికారులు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను రంగంలోకి దించి పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది పార్లమెంట్‌ ప్రధాన గేటు మూసివేశారు. భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. మరోవైపు ఢిల్లీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎపి భవన్‌ వద్ద భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. ఎవరినపి కూడా ఇక్కడ తిరుగనివ్వడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతంగా భద్రతను చేపట్టారు.
ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ ఇప్పటిది కాదని కేంద్ర ¬ంమంత్రి షిండే తెలిపారు. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం పొందాక సభ బుధవారానికి వాయిదా పడింది. బిల్లు తీరుకు నిరసనగా తృణమూల్‌, జేడీయూ వాకౌట్‌ చేశాయి. లోక్‌సభలో మంగళవారం తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించిన షిండే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు చారిత్రక అవసరమని చెప్పారు. 60 సంవత్సరాలుగా ఈ సమస్య నలుగుతూనే ఉందని చెప్పారు. గడచిన రెండు సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటుపై విస్తృత సంప్రదింపులు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు మానసికంగా ఎప్పుడో విడిపోయారని అన్నారు. తెలంగాణ ప్రజలు స్వపరిపాలన కోరుకుంటున్నారని చెప్పారు.ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని విభజనకు అందరి అభిప్రాయాలు తీసుకున్నాక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.ఆ తరవాత ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడంతో వెంటనే స్పందించిన స్పీకర్‌ వరసగా బిల్లులో సవరణలపై ఓటింగ్‌కు ఆదేశించారు. సవరణలపై ఓటింగ్‌ తర్వాత సభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్లు తెలుస్తోంది. వీరు ప్రసంగించాక మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తూ స్పీకర్‌ ప్రకటన చేశారు. అలాగే సవరణలపై ఓటింగ్‌ జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన 37 సవరణలకుగాను 36 సవరణలకు సభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిని వ్యతిరేకిస్తూ ఎంఐఎం సవరణ ఇచ్చింది. ఎంఐఎం చేసిన సవరణ వీగిపోయింది. దీంతో హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభ వెల్‌లో దాదాపు 40 మంది సభ్యులు నిరసన కొనసాగిస్తున్నారు. వెల్‌లో కేంద్రమంత్రులు పురంధేశ్వరి, చిరంజీవి, కావూరిలతో పాటు శివసేన, అన్నాడీఎంకేకు చెందిన సభ్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ తృణమూల్‌ వాకౌట్‌ చేసింది. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లు ఆమోదం పొందే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుబట్టింది. తరవాత జేడీయూ కూడా వాకౌట్‌ చేసింది. లోక్‌సభలో జరుగుతున్న విలువల పతనాన్ని తట్టుకోలేక సభనుంచి బయటకు వచ్చామని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని, ప్రజాస్వామ్య విలువలకు అక్కడ పట్టించుకునేవారు ఎవరూ లేరని శరద్‌యాదవ్‌ అన్నారు. గందరగోళం, అరుపుల మధ్య ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం పొందినట్లు ప్రకటించిన స్పీకర్‌ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.
తెలంగాణకు పూర్తి మద్దతు: మాయావతి
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలోనూ మద్దతు ఇస్తామని బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి స్పష్టం చేశారు. తాము విభజనకు మద్దతు తెలిపామని, అందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. మంగళవారం ఆమె న్యూఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లుగానో పోరాడుతున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల విభజనపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ఆమె ఆరోపించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే చాలా కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రంలో కావాలని డిమాండ్‌ చేస్తున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇరు సభల్లోనూ అనుకూలంగా ఓటు వేస్తామన్నారు.
వెల్‌లోకి దూసుకొచ్చిన సీపీఎం సభ్యులు
న్యూఢిల్లీ : లోక్‌భలో మొదటిసారిగా సీపీఎం సభ్యులు స్పీకర్‌ వెల్‌ దాటారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీసీఎం సభ్యులు మంగళవారం వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు సభలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలవగానే సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెల్లోకి దూసుకు వచ్చారు. దాంతో సీమాంధ్ర సభ్యుల నిరసనలతో సభ దద్దరిల్లింది. అయితే స్పీకర్‌ విూరాకుమార్‌ … తీవ్ర గందరగోళం మధ్యే కేంద్ర ¬ంమంత్రి షిండేకు అవకాశం ఇచ్చారు. దాంతో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపాలని షిండే సభను కోరారు. సీమాంధ్ర సభ్యుల నిరసనలతో సభ ¬రెత్తటంతో లోక్సభను స్పీకర్‌ మూడుసార్లు వాయిదా వేశారు. రాష్ట్ర విభజనను సీపీఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

సోనియా కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది : జానా
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కృషిచేసినందుకు తెలంగాణ ప్రజల తరపున రాష్ట్ర మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె యశస్సు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఇందుకు తాము ఆమెకు రుణపడి ఉన్నామని మంత్రి జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన బిజెపికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదింప జేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి జానారెడ్డి ధన్యావాదాలు తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కీర్తి శాశ్వతంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని రాష్ట్రమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసినందుకు ఆయన సోనియా, రాహుల్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై మంత్రి డి.కె.అరుణ ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు. బిల్లుకు ఆమోదంపై బిజెపి అనుసరించిన వైఖరి తనకు ఆందోళన కలిగించినప్పటికీ చివరికి మంచే జరిగిందన్నారు. బిజెపి ఆమోదంతో బిల్లు గట్టెక్కడం అభినందనీయమన్నారు. సోనియాకు తాము రుణపడి ఉన్నామని అన్నారు.

తెలంగాణ అమరులకు అంకితం : కోదండరామ్‌
న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటు చిరకాల వాంఛ అని, ఇది అమరవీరులకు అంకితమని టీ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ తెలిపారు. అమరుల త్యాగాల ఫళితంగా కేసీఆర్‌ ఉద్యమం కారణంగా ఇది సాకారమయ్యిందన్నారు. ఇందుకు మద్దతు తెలిపిన బీజేపీ, సీపీఐ తదితర అన్ని పార్టీలకు రుణపడి ఉన్నామని, వారికి కృతజ్ఞతలని అన్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ తమలో భాగమైనందున కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించిన కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనాయకత్వాలకు కోదండరామ్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రంగా నిలుపుతామని కోదండరామ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *