Tuesday, 3 November 2026

రాజ్యసభలో టీ బిల్లు పెట్టండి

:విద్యాసాగర్‌రావు
హైదరాబాద్‌: ఇవాళ రాజ్యసభలో తెలంగాణ బిల్లును యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టక పోవడంపై బీజేపీ నేత విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. రాజ్యసభలో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంత ఉత్కంఠ భరిత సమయంలో ఎందుకు ఒక రోజు సమయాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లోక్‌సభలో బిల్లు పాస్‌ అయింది కదా, ఇపుడు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. రాజ్యసభలో బిల్లును పాస్‌ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తే కదా విషయం బయటపడేది అనిఅన్నారు. బిల్లుకు బీజేపీ ఎప్పుడో ఒప్పుకుంది అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. బిల్లు విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆశామాషీగా తీసుకుంటుందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *