Tuesday, 3 November 2026

లండన్‌లో ఘనంగా తెలంగాణ సంబురాలు

లండన్‌ : రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్‌ సభలో ఆమోదం పొందిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. లండన్‌లో తెలంగాణ వాదులంతా ఒక చోట చేరి ఆటాపాటలతో సంబురాలు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు తెలంగాణ కోసం అలుపెరగని కృషి చేసిన మేధావి ప్రొ. జయశంకర్కఉ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర కోసం 14 సంవత్సరాలుగా పోరాడిన ఉద్యమ నేత కేసీఆర్‌, తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకుని రాష్ట్ర ఏర్పాటుకు చిత్తశుద్ధితో సహకరించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, బిల్లు ఆమోదం పొందటానికి సహకరించిన ప్రతిపక్ష నేత బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలంతోపాటు ఎన్‌ఆర్‌ఐ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *