న్యూఢిల్లీ : హస్తినలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్లాల్తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తాను సమావేశానికి రావడం లేదని సమాచారం ఇచ్చారు.




