న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలని కాంగ్రెస్ పట్టదలతో ఉంది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తెలంగాణ బిల్లు చర్చ జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. సభ్యలంతా గురువారం విధిగా సభకు హాజరుకావాలని ఆదేశించింది. ఇవాళ సభలో వాయిదాల పర్వం కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టలేక పోయిన విషయం తెలిసిందే.




