న్యూఢిల్లీ: ఎట్టకేలకు తెలంగాణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. గందరగోళం మధ్యే షిండే బిల్లును ప్రవేశపెట్టినట్లు సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర సభ్యలే షండే వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇతర కాంగ్రెస్ సభ్యులు సీమాంధ్ర సభ్యలను వారించారు. షిండే బిల్లుపై మాట్లాడటానికి ప్రయత్నించగా సీమాంధ్ర సభ్యులు లొల్లి ఎక్కువ చేయడంతో స్పీకర్ జోక్యం చేసుకుని షిండేగారు మీరు బిల్లును ప్రవేశపెడుతున్నట్లు చెప్పండి చాలు అన్నారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో పదినిమిషాలు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కురియన్ ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభమైన అనంతరం బీజేపీ సభ్యుడు అరుణ్ జైట్లీని బిల్లుపై మాట్లాడాల్సిందిగా కురియన్ కోరారు.




