Tuesday, 3 November 2026

నిజామాబాద్‌లో ముగ్గురు చిన్నారుల అదృశ్యం

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిజామాబాద్‌ జిల్లా రైతు నాయకుడు రఘుపతిరెడ్డి మనువరాళ్లు వీరు.  రెంజల్‌ మండలం జూపల్లికి చెందిన వీరు నిన్న రాత్రి గంగాస్థాన్‌కు శుభకార్యానికి కుటుంబ సమేతంగా హజరయ్యారు. దగ్గరి బందువే (చిన్నాన్న) చిన్నారులను కిడ్నాప్‌ చేశాడన్న సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాసర దగ్గర చిన్నారుల చెప్పులను, కారును పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *