నిజామాబాద్ : నిజామాబాద్‌లో దారుణం జరిగింది. నిన్న రాత్రి గంగస్థాన్ ఫేస్ 1 నుంచి కిడ్నాప్‌కు గురైన ముగ్గురు చిన్నారులు సిరి (9), అక్షయ (6), ఖుషీ (4), దారుణంగా హత్యకు గురయ్యారు. నిజామాబాద్ శివారులోని ఓ కాలేజీ దగ్గర చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. చిన్నారుల బాబాయ్ నరేందర్‌రెడ్డిపై అనుమానం. సంఘంన వవరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల మాజీ ఎంపీపీ రఘుపతి రెడ్డి జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ 3లో అతని రెండో కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు.
నిన్న జరిగిన ఒక శుభకార్యానికి హైదరాబాద్‌లో నివాసం ఉంటునన రఘపతిరెడ్డి పెద్ద కుమారుడు గంగారెడ్డి, చిన్న కుమారుడు వారి కుటుంబ సభ్యుల పిల్లలతో సహా శుభకార్యానికి వచ్చారు. తల్లిదండ్రులు ఫంక్షన్ లో ఉండగా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. పిల్లలకు బాబాయి వరుస అయ్యే నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి చిన్నారులకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి కారులో బయటకు తీసుకెళ్లాడు. చిన్నారులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు నరేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన నరేందర్ రెడ్డి పిల్లలను చంపేస్తున్నానని బెదిరించాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నరేందర్‌రెడ్డి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో డీఎస్పీకి ఫోన్‌చేసి చిన్నారులను చంపేస్తున్నానని మరోసారి చెప్పాడు. అతని ఫోన్ ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు బాసర ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో గాలించగా నరేందర్‌రెడ&ఇడ తీసుకెళ్లిన కారు, నరేందర్ రెడ్డి చెప్పులు గోదావరి నది బ్రిడ్జిపై కనిపించాయి. ఉదయం 10 గంటల వరకు చిన్నారులు క్షేమంగానే ఉన్నారని అంతా అనుకున్నారు. కాని అంతలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ముగ్గురు చిన్నారుల శవాలు ఉన్నాయని సమాచారం అందడంతో పోలీసులు అటువైపు పరుగు తీశారు. శవాలను పంచనామా చేసిన పోలీసులు అవి కిడ్నాప్‌కు గురైన చిన్నారులవిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల కుమార్తెలు మృతి చెందడంతో రెంజల్ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




