ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బీజేపీ కోరుతున్నట్లుగా సీమాంధ్రకు న్యాయం చేసే విషయంలో ప్రస్తుత తరుణంలో తెలంగాణ బిల్లులో రాజ్యాంగ సవరణలు సాధ్యం కాదు. ఈ మేరకు సీమాంధ్రకు తీసుకునే చర్యలను సభలో వివరిస్తామని సుషీల్కుమార్ షిండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతిపాలనపై సమావేశంలో చర్చించలేదు. గవర్నర్ నివేదిక పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు సహకరించేది లేనిదీ మీ ఇష్టమని బీజేపీకి తేల్చి చెప్పిన కేంద్రం.




