Monday, 2 November 2026

ఆప్‌లోకి గాంధీ మనవడు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. మహత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్‌గాంధీ శుక్రవారం ఆప్‌లో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ విధానాలు తనకు నచ్చడంతో పార్టీలో చేరినట్టు రాజ్‌మోహన్‌ తెలిపారు. దేశంలో అవినీతి హెచ్చరిల్లి ధనిక, పేదల మధ్య తారతమ్యం పెరిగిపోయిందన్నారు. అవినీతిని రూపుమాపేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటం తనను ఆకట్టుకుందన్నారు. ఇకపై ఆమ్‌ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేస్తానని, ఆప్‌ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై చెప్పడానికి నిరాకరించారు. ఈ 78 ఏళ్ల రాజ్‌ మోహన్‌ గాంధీ 1989లో అమేథీ నుంచి జనతాదళ్‌ పార్టీ తరపున మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *