Tuesday, 3 November 2026

తెలుగువారిగా కలిసుందాం : ఎంపీ గుత్తా

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా తమ అధినేత్రి సోనియాకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మనం రాష్ట్రాలుగా విడిపోయామని, తెలుగువారిగా కలిసుందామని పిలుపునిచ్చారు. ఇరు ప్రాంతాలవారం కలిసుండి అభివృద్ధి సాధిద్దామన్నారు. ఇందుకోసం ఒక సుహ్రుద్భావ వాతావరనం సృష్టించుకుందామని కోరారు. దీనికి అందరూ సహకరించలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యంగా మీడియా సహకరించాని రెచ్చగొట్టే వార్తలను రాయకూడదని మనవి చేశారు. ఆనాడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్నాం. ఇవాళ మేమే ఇచ్చాం, మేమే తెచ్చాం అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *