మహబూబ్‌నగర్ : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వాహనం ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆలోలోని పన్నెండు మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉప్పునుంతల మండలం కట్లబండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.




