Tuesday, 3 November 2026

టీ టీడీపీని ఎవరూ ఆదరించొద్దు : మధుయాష్కీ

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దేశమంతా తిరిగారని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంకు చేరుకోగానే విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని ఎవరూ ఆదరించొద్దని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణకు మద్దతునిస్తూన్నామంటూనే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు దేశమంతా ఎందుకు తిరిగారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంకా సిగ్గులేకుండా టీ టీడీపీ నేతలు విజయోత్సవ సభలు అంటున్నారని యాష్కీ మండిపడ్డారు. ఇప్పటికైనా టీ టీడీపీ నేతలు కళ్లు తెరవాలని సూచించారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు కూడా గమనించాని కోరారు. తెలంగాణ గడ్డపై అడుగుమోపినందుకు తమ జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు వెన్నుపోటు పొడిచాన సోనియగాంధీ ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *