హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ అభివర్ణించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా సోనియాగాంధీకి అభినందన సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి తెలంగాణలోని డీసీసీ కార్యాలయాల్లో కృతజ్ఞత సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విజయోత్సవాల సభ నిర్వహణపై చర్చిస్తామని స్పష్టం చేశారు.




