Tuesday, 3 November 2026

సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేదికాదు : సర్వే

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్లే తెలంగాణ కల సాకారమైందని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో సోనియా లేకపోతే, ఆమె నాయకత్వమే లేకపోతే తెలంగాణ వచ్చేదికాదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ చేయలేని ధైర్యం సోనియా చేశారని పొగిడారు. అయితే విజయోత్సవ సభలు జరుపుదామంటే అధిష్ఠానం సీమాంధ్ర ప్రజలు బాధపడుతారని సూచించడంతో ఆగిపోయామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *