హైదరాబాద్ : తెలంగాణ రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయరాని కుట్రలన్నీ చేశాడని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి తెలంగాణ నేతలతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీని తెలంగాణ నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సింహంలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు




