Tuesday, 3 November 2026

లోక్‌సభ ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ శ్రీకారం

విలువల కోసమే రాజీనామా : అరవింద్‌ కేజ్రీవాల్‌
రోహ్‌తక్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆదివారం హర్యానాలోని రోహ్‌తక్‌లో పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రాచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో విలువలు పెంపొందించడానికే తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి సహా ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే విచారణ చేపట్టేందుకు జన్‌ లోక్‌పాల్‌ వజ్రాయుధమని, దానికి కాంగ్రెస్‌, బీజేపీలు మద్దతివ్వలేదని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయాల్లో, పార్లమెంటరీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. అందుకోసమే తమ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ఉద్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యోగేంద్రయాదవ్‌, మనీశ్‌ శిసోడియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *