Tuesday, 3 November 2026

రాష్ట్రానికి కొత్త సీఎం

రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చు : షిండే
హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త సీఎంను నియమిస్తామని, రాష్ట్రపతి పాలనకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో తానెలాంటి జోక్యం చేసుకోనని షిండే తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయిస్తుందని కేంద్ర ¬ం మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మూడునెలల సమయం పడుతుందని షిండే తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని షిండే తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పందించాల్సింది ఎన్నికల సంఘమేనని స్పష్టం చేశారు. ఎన్నికలపై తుది నిర్ణయం ఈసీదేనని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత అధిష్టానానిదేనని, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపారు. విభజన ప్రక్రియకు మరో మూడు నెలల సమయం పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం గాని మంగళవారం గాని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. నాల్గో సీఎం ఎవరో తేలాలంటే మరో 24 గంటల పాటు వేచి ఉండాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఇలా పలువురి పేర్లపై సర్వత్రా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా సీఎం పీఠంపై ఎవరు అధిరోహించనున్నారో తేలాలంటే మరో 24గంటల పాటు వేచి చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై హైకమాండ్‌ పెద్దలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు సీఎం రేసులో ఉన్నారు. కాగా కాంగ్రెస్‌లో చాలా మంది రాజీనామాల బాటపడుతుండటంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *