Tuesday, 3 November 2026

కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలుకుతాం


బాబు అడుగడుగునా అడ్డుకున్నాడు : హరీశ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి ముఖ్య కారకుడు, తెలంగాణను సాధించి స్వంత గడ్డకు తిరిగి వస్తున్న టీఆర్‌ఎస్‌
పార్టీ అధినేత, ఉద్యమ రథసారథి కేసీఆర్‌ రాక సందర్భంగా ఆ పార్టీ కేడర్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లో ఆయనకు లక్షలాది జనంతో ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించారు. ఉద్యమ నేతకు మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలుకుతామని టీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే హరీష్‌ రావు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు కేసీఆర్‌ వెళ్తారని అక్కడినుంచి గన్‌పార్క్‌ వరకు భారీ ర్యాలీగా వస్తారని హరీష్‌రావు వెల్లడించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి లైఫ్‌ స్టైల్‌, సీఎం క్యాంపాఫీస్‌, షాదన్‌ కాలేజ్‌, రవీంద్రభారతి విూదుగా గన్‌పార్క్‌వరకు ర్యాలీ ఉంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రథంపై కేసీఆర్‌ ర్యాలీలో పాల్గొంటారని, వంద గుర్రాలు, ఒంటెలతో పాటు కళా బందాలు, డప్పులు, బతుకమ్మలతో ధూంధాంగా కేసీఆర్‌కు స్వాగతం పలకడానికి ఎవరికి స్వచ్ఛంధంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన వివరించారు. తలెంగాణ సాధనే లక్ష్యంగా కెసిఆర్‌ పార్టీపెట్టి విజయంసాధించారని అన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేశారని హరీష్‌ రావు సోమవారం విూడియా సమావేశంలో చెప్పారు. ర్యాలీ కోసం డీజీపీతో అనుమతి కూడా తీసుకున్నామని ఆయన స్ఫష్టం చేశారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రానున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుతామని హరీశ్‌రావు చెప్పారు. ఎల్లుండి అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి గన్‌పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్‌ రావు సోమవారం నిప్పులు చెరిగారు. తెలంగాణకు మద్దతు పలకని జగన్‌కు తమ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. కొద్ది రోజులైతే జగన్‌నే ఓదార్చాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నమ్ముకున్న నేతలనే నట్టేట ముంచిన జగన్‌ ఈ ప్రాంతంలో ఓదార్పు యాత్ర ఎలా చేపడతారని ప్రశ్నించారు. జగన్‌ ఓదార్చాలనుకుంటే ముందు కొండా సురేఖ, జిట్టా బాలకృష్ణా రెడ్డిలాంటి వారిని ఓదార్చాలన్నారు. తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హరీష్‌ రావు అన్నారు. ఉద్యమానికి ఏం చేశారని వారు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతించలేని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం ఎందుకన్నారు. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకే టిడిపి విజయోత్సవాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఓవైపు తెలంగాణ కోసం కెసిఆర్‌ ప్రయత్నం చేస్తుంటే అన్నిపార్టీల నేతలను కలసి తెలంగాణరాకుండా అడ్డుకున్న బాబు ఇప్పుడు విజయోత్సవాలతో ితెలంగాణలో పర్యటించాలనుకోవడం తెలంగాణ ద్రోహమేనన్నారు. ఢిల్లీలో మకాం వేసి అన్ని పార్టీల నేతలను కలసి ఇప్పుడు తెలంగాణ వద్దని, ఎఎందుకు ఇవ్వాలని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పిన మాట వాస్తవం కాదా అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన చంద్రబాబుకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *