
హైదరాబాద్ చేరుకున్న ఓయూ విద్యార్థులు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి):
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విద్యార్థుల ఆందోళనలు, పోరాటాల వల్లనే వచ్చిందని ఉస్మానియా విశ్వవిద్యాల యం తెలంగాణ విద్యార్థి సంఘాలు వ్యాఖ్యానించాయి. సోమవారంనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పుస్కరించుకుని విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాల యం క్యాంపస్లో సంబరాలు జరుపుకున్నారు. ఎంపీసీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చుతూ, నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విద్యార్థి సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ, 60 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాల వల్లనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వచ్చిందని వారు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలపాత్ర పోషించారని అన్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరగనంత రీతిలో తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని వారు అన్నారు. ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో విద్యార్థులే ముందుండి నడిపారని అన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ప్రకటిచడంలో ఎన్నొ కష్టాలు ఎదురుకున్న సోనియాకు తెలంగాణ ఉద్యమాన్ని విడవకుండా కేసీఆర్ చేపట్టినందుకు ధన్యావాదాలు తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తాము కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ
ఉద్యమంలో అక్రమ కేసులు బనాయించినా విద్యార్థులు ఉద్యమంలో చురకైనా పాత్ర పోషించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థి సంఘాలు పోటీ చేసేందుకు అన్ని పార్టీలు అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరాయి. లేకుంటే తెలంగాణలోని 119 సీట్లలో విద్యార్థి సంఘాల నేతలే పోటీ చేస్తారని హెచ్చరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుచే ప్రధాన భూమిక పోషించే విధంగా పార్టీలు కృషి చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ పోరులో విద్యార్థులే కీలకం




