Tuesday, 3 November 2026

తెలంగాణలో టీడీపీకి షాక్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో శరవేగంగా పరిణామాలు జరుగుతాయని ఆ పార్టీ ఊహించినట్టే జరుగుతుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, కేఎస్‌ రత్నం టీఆర్‌ఎస్‌లోకొ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *