Monday, 2 November 2026

ముఖ్యమంత్రి పదవి రేసులో లేను: చిరంజీవి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఈ విషయంలో మీడియా ఆనవసరంగా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక వేళ ముఖ్యమంత్రి పదవి తనకిస్తుంటే ఆ విషయం మీడియాకే ముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పై తానేమీ వ్యాఖ్యానించబోనని ప్రజాస్వామ్యంలో ఎవరైన రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *