హైదరాబాద్: 60 ఏడ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఈ అపూర్వ సంఘటనను ఆయన మదిలో చిస్ఠాయిగా నిలపాలని ఆశిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు బేగంపేట విమానశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుశ్రేణిలో ఒంటెలు, తర్వాత ఏనుగులు, అటు తరువాతి వరుసలో కళాకారులు తమ ఆటపాటలతో విజయోత్సవ ర్యాలీని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని సంయమనంతో వ్యవహరించి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.




