కేబినెట్ నోట్‌పై ముందే చెప్పింది
ఇదిగో సాక్ష్యం : నిండుసభలో కృష్ణమాదిగ
మహదేవపూర్, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
జనంసాక్షే నిజమైన తెలంగాణ దినపత్రిక అని ఎమార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ బిల్లుపై కేబినెట్ నోట్ సిద్ధం చేస్తున్న విషయాన్ని జనంసాక్షి ముందే చెప్పిందంటూ నిండు సభలో ఆయన తెలిపారు. మండలంలోని కాళేశ్వరంలో బుధవారం ఆయన గిరిజనుల హక్కుల సాధన కోసం సైకిల్‌యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడంతో పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాలపై జనంసాక్షి గొంతెత్తి ప్రశ్నించిందని అన్నారు. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న ఆదివాసీలకు అండగా ఉంటానని మందకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఖమ్మం జిల్లాలో పోలవరం నిర్మాణం ద్వారా గిరిజన గూడాలను, ఆదివాసీలను ముంచేందుకే పోలవరం నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. ముంపు గ్రామాల్లోని గిరిజనుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు సైకిల్ యాత్ర చేస్తున్నట్లు మందకృష్ణ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని ఆదివాసీలకు చెందిన 200 ముంపు గ్రామాల్లోని 3లక్షల మంది ఆదివాసీలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో సీమాంధ్ర నాయకులు రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతున్నారని మండిపడ్డారు. ఓ పత్రిక ఎండీతో కేసీఆర్ పోలవరం ప్రాజెక్టు కోసం కుమ్మకై ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతున్నా ఢిిల్లీలో కూర్చుని మౌనంగా ఉన్నాడని ఆయన దుయ్యపట్టారు. మళ్లీ అగ్రవర్ణాలు తెలంగాణను దోచుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఢిిల్లీలో సీమాంధ్ర నాయకులతో మంతనాలు చేసి పోలవరం కోసం ఒప్పందం చేసుకున్న కేసీఆర్ తెలంగాణ గిరిజనులను మోసం చేశారని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు.
జనంసాక్షే నిజమైన తెలంగాణ పత్రిక





