Monday, 2 November 2026

కాంగ్రెస్‌ గూటికి విజయశాంతి

కడువా కప్పి ఆహ్వానించిన సోనియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
మెదక్‌ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోనియాగాంధీతో భేటీ అయిన ఆమె భవిష్యత్‌ రాజకీయాలపై స్పష్టమైన హామీ తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ, విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సంతోషదాయకమన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామన్న మాటకు టీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉండాలని విజయశాంతి పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ బలోపేతానికి పాటు పడతానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *