శ్రీకాకుళం : థర్మల్ పవర్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఉద్యమకారులపై కాల్పులు జరిపిన ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో పచ్చని పొలాల మధ్య థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అమనుతినిచ్చింది. దీన్ని నిరసిస్తూ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద యెత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఉద్యమాన్ని అణిచేక్రమంలో ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి తమ జీవితాల్లో బూడిదను నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు భయాందోళనను దృష్టిలో ఉంచుకొని పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా ఉద్యమ నాయకులు కోరుతున్నారు. మతులను స్మరించుకుంటూ, థర్మల్ పవర్‌ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ నేడు కాకరాపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు రైతు కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.




