హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ వద్దకు మున్సిపల్ ఎన్నికల ఫైల్ చేరుకున్నట్లు సమాచారం. తొలి విడతగా 146మున్సిపాలిటీ, 10 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మున్సిపాలిటీల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫైల్‌పై గవర్నర్ సంతకం చేసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.




