ఇస్లాంను ఆమోదించడమే
అది ఇరాన్లో పుట్టింది : ప్రొఫెసర్ కంచ ఐలయ్య
వామపక్షాలే దేశానికి రక్ష : మాజీ ఎంపీ అజీజ్‌పాషా
హైదరాబాద్, మార్చి 2 (జనంసాక్షి) :
బీజేపీ నాయకులు చాయ్‌పై చర్చించడం అంటే ఇస్లాంను ఆమోదించడమేనని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని త్రివేణి హాస్టల్, డాక్టర్ వైపీ రాజ్ కళావేదికలో బహుజన సెక్యులర్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మనువాద హిందూ ఫాసిస్టు నరహంతక నరేంద్రమోడీని ఓడిద్దాం-బహుజన రాజ్యాధికారం సాధిద్దాం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోడీని చాయ్ వాలాగా చూపుతూ ప్రస్తుతం రోడ్లపై చాయ్ బండ్లు పెట్టుకొని అమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీల ఓట్లు దండుకోవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. మోడీని దళిత, బహుజనులు చాయ్ వాలాగా గుర్తిస్తే ఆయా వర్గాల మనుగడకే పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. చాయ్, చాయ్ వాలా పేరుతో ప్రచారం సాగిస్తోన్న బీజేపీ అసలు చాయ్ హిందూ సంస్కృతిలో భాగం కాదనే విషయాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. మన దేశంలోని చాయ్ ముస్లిం దేశమైన ఇరాన్ నుంచి వచ్చిందని, మొదట్లో ఇరానీ హోటళ్లలో మాత్రమే చాయ్ దొరికేదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇరాన్లో బిర్యానీ తిన్న అనంతరం ముస్లింలు చాయ్ తాగేవారని, హిందూ దేవతలెరూ చాయ్ తాగినట్లుగా చరిత్రలో లేదన్నారు. హిందుత్వానికి సంబంధంలేని చాయ్‌ని బీజేపీ ప్రచారాస్త్రంగా ఎంచుకోవడమే కాదే దేశవ్యాప్తంగా చాయ్ స్టాళ్లు ఏర్పాటు చేయడంలో ఓట్లు దండుకునే కుట్రే దాగుందన్నారు. బీజేపీ చాయ్‌ను ప్రచారాస్త్రంగా ఎంచుకుందంటే ముస్లింవాదాన్ని అంగీకరిస్తున్నట్టేనా అని ఆయన ప్రశ్నించారు. మోడీ చాయ్ వాలా పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తుంటే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయమ్ సింగ్ యాదవ్ తాను దూద్‌వాలా అని ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలోకి ఆర్యులు ప్రవేశించకముందే ఇక్కడ బర్రెలు పాలిచ్చేవని, బీసీ అయిన ములాయం తన వర్గానికి ఏమి చెస్తాడో చెప్పకుండా తాను దూద్‌వాలా నంటూ ప్రచారం చేసుకోవడం తగదన్నారు. భారతీయులకు ఆవు ఆరధ్య దైవం కాదని, పాలిచ్చి అందరిని సంరక్షించే బర్రే మన జాతీయ జంతువని ఆయన అభివర్ణించారు. ఆర్యులు కుట్రల ద్వారా మనువాదాన్ని అమల్లో పెట్టి దేశంలో అత్యధిక జనాభా ఉన్న దళిత, బహుజన, మైనార్టీ, ఆదివాసీలను అధికారానికి దూరం చేశారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని, తనను తాను బీసీగా చెప్పుకునే నరేంద్రమోడీ గతంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయితే అందరూ అనుకుంటున్నట్టుగా మత పరమైన మైనార్టీలకే కాదు యావత్ దేశ ప్రజలకూ ప్రమాదమని ఆయన హెచ్చరించారు. మోడీకి సొంత ఎజెండా అంటూ ఏమి ఉండదని ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఎజెండానే మోడీ ఎజెండా అవుతుందని అన్నారు. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే దళిత, బహుజన, మైనార్టీ, ఆదివాసీల ధ్యేయం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రధాని అయితే హిందూ అతివాద శక్తులు తమ జూలు విధిలిస్తాయని, మహిళలు సమానత్వం కోల్పోయి భర్తలకు దాసీలుగా మిగులుతారని అన్నారు. మోడీ ప్రధాని అయితే రిజర్వేషన్లుండవని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, నిత్యం పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం వల్ల 56 ముస్లిం దేశాలు భారత్‌పై శత్రుత్వం పెంచుకునే ప్రమాదమున్నదని అన్నారు. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా కంచె ఐలయ్య ఖండించారు. తాను హిందూ దేవతలను పూజించనని, పుస్తకాలను మాత్రమే పూజిస్తానని తేల్చిచెప్పారు. అందరిలాగా పెద్ద పెద్ద స్కూళ్లలో తాను చదవలేదని, పోచమ్మ స్కూళ్లో చదివి అంతర్జాతీయ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. బైబిల్ పట్టుకోవడాన్నే మత ప్రచారంగా చూపే బీజేపీ దేశంలోని పల్లెపల్లెనా ఉన్న గాంధీ విగ్రహాల చేతుల్లోని భగవద్ఘీతలపై ఏం చెప్తారని ప్రశ్నించారు. భగవద్ఘీత ఉన్నందుకు గాంధీ విగ్రహాలను తొలగిస్తే రాజ్యాంగాన్ని పట్టుకొన్న అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే మిగులుతాయని పేర్కొన్నారు. తాను తెలంగాణను వ్యతిరేకించింది దొరల రాజ్యం వద్దనేనని అన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ప్రజలు చైతన్యవంతం కాకపోతే బానిసలుగా మిగిలిపోతామని అన్నారు. మాజీ ఎంపీ అజీజ్‌పాషా మాట్లాడుతూ దేశానికి వామపక్ష పార్టీలే రక్ష అని అన్నారు. కార్యక్రమంలో వలిగి ప్రభాకర్, మిట్టు నాయక్, సిరిగిరి మన్యం, వెంకటేశ్వర్లు, రవి, విజయ్‌కుమార్‌గౌడ్, ధర్మరాజు, లోకిని రాజు, శ్రీనివాస్, అభినవ్, జాన్‌వెస్లీ, మైసయ్య, రాములు, అజయ్‌కుమార్ యాదవ్, చెన్నయ్య, అడ్డూర శ్రీనివాస్, రమేశ్, రమేశ్, గోగు శ్యామల, సుభద్ర, మంజుల, గాదె వెంకటేశ్, కొత్వాల్, వర్గీస్ టెక్దాన్, జగన్‌రెడ్డి, సురేందర్‌రాజు, ఎం.ఎం. రహమాన్, సురేందర్, వెంకన్న, రవి, సీతారాం, చంద్రప్రకాశ్, నర్సింహారెడ్డి, గుడిపల్లి రవి, పురుషోత్తం, సుదర్శన్, దుర్గం భాస్కర్, నలిగంటి శరత్, బద్రి, స్టాలిన్, హరినాథ్, శ్రీనివాస్, ఆంజనేయులు, ఆజాద్, సత్య, శేషు, నెహ్రూనాయక్, రమేశ్, డానియల్, బాల్‌రాజ్, కల్లెపెల్లి సిద్ధార్థ, గద్దల అంజిబాబు, అనిల్, రాము, హబీబ్ ఖాద్రీ, చంద్రన్న, బగ్గునాయక్, మోహన్, చెన్నయ్య, రంజిత్, అంజినాయక్, ప్రభాకర్, రామారావుగౌడ్, సతీశ్ యాదవ్, శంకర్‌నాయక్, శ్రావణ్, సంతోష్, పుల్లారావు, డొక్క నరసింహా, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు.





