Monday, 2 November 2026

ఎప్పుడు ఇంటికి వ‌స్తారు

అప్పుడు చంపేశారు.. ఇప్పుడు సారీ అంటారా?
భాజపాపై ములాయం ఫైర్‌
అలహాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) :
అప్పుడు చంపేసి ఇప్పుడు క్షమాపణలు చెప్తారా అంటూ బీజేపీపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ధ్వజమెత్తారు. స్థానిక పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన పార్టీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, మోడీని మానవత్వ హంతుకుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీ దేశాభివృద్ధికి హానికరమని ఆయన అన్నారు. ముస్లింలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ములాయం ఎద్దేవా చేశారు. సామూహిక ఊచకోతలు కోసిన బీజేపీ ఇప్పుడు క్షమాపణ చెప్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మోడీ చరిష్మా ఎంతమాత్రం పనిచేయదని ఆయన అన్నారు. గుజారత్‌ అభివృద్ధి నమూనాను ఆయన తోసిపుచ్చారు. గుజరాత్‌లో కాలుష్యం, చెత్తతో నిండిపోయిన నదులు తప్ప ఏమీలేవన్నారు. కాంగ్రెస్‌ పేద, మైనార్టీ వర్గాల కోసం ఎలాంటి పాలసీలు లేవన్నారు. దేశ సరిహద్దులు కూడా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల సురక్షితంగా లేవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *