Monday, 2 November 2026

‘బంగారు’కు ఘన నివాళి

అంత్యక్రియల్లో భాజపా అగ్రనేతలు
హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) :
బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్‌కు ఆత్మీయులు, భాజపా శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఆయనకు కన్నీటితో తుది వీడ్కోలు పలికాయి. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో కన్నుమూసిన ఆయన భౌతిక కాయానికి ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్టలోని హిందూ శ్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియల్లో బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు, ప్రజా గాయకుడు గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బంగారు లక్ష్మణ్‌ పార్దీవ దేహాన్ని ఆదివారం ఉదయం నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడ సీనియర్‌ నేతలు వెంకయ్య, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు తదితరులు బంగారు లక్ష్మణ్‌ పార్దీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లక్ష్మణ్‌ భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *