Monday, 2 November 2026

గవర్నర్‌ చేతికి శాంతిభద్రతలొద్దు

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌
హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ నగర శాంతిభద్రతలు గవర్నర్‌ చేతిలో పెట్టవద్దని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు భద్రత పేరుతో శాంతి భద్రతలు గవర్నర్‌ చేతిలో పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. ఆదివారం పాతబస్తీలోని దారుస్సాలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎంఐఎం 56వ వార్షికోత్సవంలో అసదుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి కనుమరుగైనట్టేనని, అయినా కోలుకోడానికి ప్రయత్నిస్తోందన్నారు. బిజెపికి మద్దతు ఇవ్వొద్దని అందర్నీ కోరుతున్నాను. ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్‌ఆర్‌సిపి ఏం చేస్తుందో.. ఏం చేయనున్నదో తనకు తెలీదన్నారు. ముస్లింలకు ప్రస్తుతం నాలుగుశాతం రిజర్వేషన్‌ అమలవుతుందంటే మహానేత వైఎస్‌ఆర్‌ ఇచ్చిన వరమేనని అన్నారు. వైఎస్సార్‌ ఒక్కరే ముస్లింల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు, మేయర్‌ మజిద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *