విశాఖపట్నం : సహకార ధోరణితో రాజకీయ వాతావరణం ఉండాలని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఒక జాతి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిందన్నారు. సీమాంధ్రకు రాజధాని నిర్ణయంపై త్వరలో కమిటీ ఏర్పడుతుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన 85 శాతం విద్యుత్ కేటాయింపులు, వినియోగం ఆధారంగా 15 శాతం కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఎన్డీసీ సమావేశంలో ఇద్దరు తెలుగు సీఎంలు పాల్గొంటారని పేర్కొన్నారు. హిందీ తర్వాత ఆ ఘనత తెలుగుకే దక్కుతుందన్నారు. విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు సహకరించుకునే తీరుపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. దాజధానిపై నిపుణులు కమిటీ కేంద్రానికి నివేదిక ఇస్తుందని, నివేదిక ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.




