హైదరాబాద్ : తెలుగు జాతికి అన్యాయం జరిగింది తెలుగుదేశం అధినేత చంద్రబాడునాయుడు అన్నారు. నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రసంగిస్తూ తెలుగువారి జీవితాలతో ఆడుకునేందుకు జైరాం రమేష్ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారం విభజించి సీమాంధ్రకు రాజధాని అంశంలో జిల్లాల మధ్య చిచ్చుపెట్టాలని ఆయన అన్నారు.




