Tuesday, 3 November 2026

రాష్ట్ర ప్రజలపై మరో ఎన్నిక!

హైదరాబాద్‌్‌, మార్చి 7 : నేడో.. రేపో.. జడ్‌పిటిసి, ఎంపిటీసీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు  తెలిసింది. స్థానిక ఎన్నికలకు సోమవారంలోపు నోటిఫికేషన్‌ జారీ చేయాలని శుక్రవారంనాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. శుక్రవారం సాయంత్రంలోగా గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల జాబితా ఫైల్‌ వెళ్లనున్నట్టు తెలిసింది. ఆయన ఆమోదించగానే రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్‌శాఖ మరో రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తం మీద శనివారం సాయంత్రం గాని సోమవారం గాని నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.  ఇదిలా ఉండగా మునిసిపల్‌ ఎన్నిక ఈ నెల 30న జరగనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జడ్‌పిటిసి ఎన్నిక.. ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *