Wednesday, 4 November 2026

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు తీసుకోండి


అధికారులతో భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి) :
రాష్ట్రంలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ సూచించారు. ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని భన్వర్‌లాల్‌ వారిని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో గురువారం సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై భన్వర్‌లాల్‌ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *