Wednesday, 4 November 2026

పొత్తు, విలీనం మేమెప్పుడడిగాం


కేకే కమిటీ ఎందుకేశారు
తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల ప్రశ్న
హైదరాబాద్‌, మార్చి15 (జనంసాక్షి) :
ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాలని కానీ, పార్టీని విలీనం చేయాలనిగానీ తామెప్పుడు అడిగామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎన్నికల్లో పొత్తు, కాంగ్రెస్‌లో విలీనం ప్రతిపాదనలను కాంగ్రెస్‌ ఎప్పుడూ తేలేదని పొన్నాల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో విలీనం చేస్తామని మొదట చెప్పిన పార్టీ టీఆర్‌ఎస్‌ తప్ప కాంగ్రెస్‌ కాదన్నారు. ఇప్పుడు విలీనంపై తెరాసనే ఇప్పుడు మాటతప్పిందన్నారు. ఎన్నికల్లో పొత్తులకోసం కమిటీ వేసింది కూడా తెరాసనేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని పొన్నాల పేర్కొన్నారు. పొత్తు ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని మాత్రమే తాము అన్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన తాము చేయలేదని, పొత్తు కోసం ప్రయత్నాలు కూడా చేయలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావే అన్నారని ఆయన గుర్తు చేశారు. తెరాస నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని మాత్రమే తాము చెప్పామని, ప్రతిపాదనలు వస్తాయో లేదో వారే చెప్పాలని ఆయన అన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టారని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారని, ఇప్పుడు కేసీఆర్‌కు కేసులు గుర్తుకు వచ్చాయా అని పొన్నాల అన్నారు. విలీనం చేస్తామని చెప్పి తెరాస మాట తప్పిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో పొత్తుల కోసం కమిటీ వేసింది కూడా తెరాసనే అని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని ఆయన అన్నారు.పదవి కోసమే దివాకర్‌ రావు తెరాసలో చేరారని కాంగ్రెసులో చేరిన తెరాస మాజీ నేత అరవిందరెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చారనే తాను కాంగ్రెసులో చేరినట్లు ఆయన తెలిపారు. కెసిఆర్‌ హిట్లర్‌ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు. తెరాస శాసనసభ్యులంతా కేసీఆర్‌ వద్ద పాలేరులేనని, తాము తెరాసలో కెేసీఆర్‌ పాలేరులా బతికామని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస మధ్య పొత్తు ఉంటేనే ఉభయులకూ లాభమని ఆయన అన్నారు. తనతో పాటు కాంగ్రెసులోకి వస్తామని హావిూ ఇచ్చిన తెరాస శాసనసభ్యులు మాటమీద నిలబడాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *