నల్గొండ ; నల్గొండ జిల్లా పెద్దవూర మండలం బాతోనిబాయితండాలో తమ సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించిన వ్యక్తి పై గ్రామస్ధులు దాడి చేసి బంధించారు .సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని బంధించిన వ్యక్తిని విడింపించే ప్రయత్నించారు .ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్ధులు రాళ్లతో పోలీసులుపై దాడి చేశారు ఈ దాడిలో ఎ ఎస్‌ఐ హెడ్‌కానిస్టేబుల్ తో సహ మరో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హలీయా సీఐ తెలిపారు .




