మోడీ వాదం లౌకికత్వానికి చెద

అరుణాచల్‌ నన్ను అబ్బురపరిచింది : రాహుల్‌
సుబన్‌గిరి, మార్చి 19 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదంతో భారత లౌకికవా దానికే చెదపట్టే ప్రమాదముందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అరుణా చల్‌ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ మోడీ చేస్తున్న విభజన రాజకీయాలపై ఆయన మండిపడ్డారు. ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రగల్చడం ద్వారా మోడీ అధికారాన్ని చేజి క్కించుకోవాలని ఆరాటపడు తున్నాడని మండిపడ్డారు. అరు ణాచల్‌ ప్రదేశ్‌ అందాలను తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రాహుల్‌ తెలిపారు. రాజకీయాల నుంచి రిటైరయ్యాక ఇక్కడే స్థిరపడాలని అనిపిస్తోందని చెప్పారు. అపనిత పీఠభూమిగా ప్రసిద్ధిగాంచిన హపోలీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. ఇంత అందమైన ప్రాంతాన్ని తాను మరెక్కడా చూడలేదం టూ కితాబిచ్చాడు. బీజేపీ దేశంలో విభజన రాజకీ యాలను ప్రోత్సహిస్తూ లౌకికవాదాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతోందంటూ మండిపడ్డారు. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను పెంచిందని ఆయన మండిపడ్డారు.