Tuesday, 3 November 2026

నరేంద్రమోడీ ఎలిమెంటరీ స్టూడెంట్‌

ఆయనకు ఏ కోర్టూ
క్లీన్‌చీట్‌ ఇవ్వలేదు
మెజిస్ట్రేట్‌ కోర్టు కూడా పిలువలేదు
కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌
ఫరీదాబాద్‌, మార్చి 19
(జనంసాక్షి) :
గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎలిమెంటరీ స్కూల్‌ పిల్లాడంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లోని గోద్రా మారణహోమంపై ఆయనకు ఎవరూ క్లీన్‌చీట్‌ ఇవ్వలేదని ఆయన తేల్చిచెప్పారు. మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు గోద్రా మారణ హోమం కేసులో తనకు క్లీన్‌ చీట్‌ ఇచ్చిందంటూ నరేంద్రమోడీ ప్రచారం చేసుకోవడం నర్సరీ పిల్లాడి మాటల్లా ఉన్నాయని తెలిపారు. అసలు మోడీకి ఎవరూ క్లీన్‌ చీట్‌ ఇచ్చారో తనకైతే తెలియదని, ఆయన చెప్తున్న మెజిస్ట్రేట్‌ కనీసం తనను కోర్టుకు కూడా పిలువలేదని అన్నారు. మంచి గ్రేడ్‌ వచ్చిన నర్సరీ పిల్లాడు తాను డాక్టర్‌ అయిపోయినట్టు, పీహెచ్‌డీ సాధించినట్లుగా భ్రమిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *