నేడు వాయుసేన హెలీకాప్టర్లు రంగంలోకి
తిరుమల, మార్చి 19 (జనంసాక్షి) :
శేషాచల కొండల్లో మంటల్లు చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు భక్తుల భద్రత విషయంలో ముందు జాగ్రత్తలు చేపట్టారు. అలిపిరి వద్ద నడకదారి భక్తులను అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. అలాగే పాపవినాశనం రూటును మూసేసారు. మరోవైపు తిరుమల శేషాచల అడవుల్లో చెలరేగిన మంటలు అదుపులోకి రావడం లేదు. శేషాచల కొండల్లో మంటలు గంట గంటకూ ఉధృతమవుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది ఎంతగా ప్రయత్నిస్తున్నా మంటలు అదులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తిరులమ కొండపై ఉన్న అన్ని దుకాణాలను మూసేయాలని ఆదేశించింది. అంతేకాకుండా పాపవినాశం వెళ్ళే దారిని మూసేశారు. కాగా మంటలను అదుపుచేసేందుకు అడవిలోకి వెళ్లి ఈ మంటల్లో దాదాపు 300మంది దాకా చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ ఇంజిన్‌లో నీళ్లు అయిపోవడంతో సిబ్బంది చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. అడవి అంతా దట్టమైన పొగలతో నిండిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరక్కోణంనుంచి నేవీ సిబ్బంది బయలుదేరినట్లు సమాచారం. మంటల అదుపునకు నేవీ సాయం కోరారు. శేషాచలం అడవులను కార్చిచ్చు దహిస్తోంది. కాకుమానుకొండ ప్రాంతంలో చెలరేగిన మంటలు పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే గాలిమరల వైపు విస్తరించాయి. దీంతో మంటలకు గాలి మరలు దగ్ధమైంది. మరోవైపు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా కొండపై దట్టమైన పొగ వ్యాపించటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్నం పాపవినాశనం రోడ్డులోని పార్వేటి మండపానికి సవిూపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు అదుపుతప్పాయి. దీంతో వేలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమవుతోంది. పాపవినాశనం ఫారెస్ట్‌కు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో 4 ఫైరింజన్లు, 5 టీటీడీ ట్యాంకర్లతో మంటలను అదుపుచేసుందకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మంటలను అదుపుచేసేందుకు పక్క జిల్లాల నుంచి ఫైరింజన్లు, అంబులెన్సలను తిరుమలకు తరలిస్తున్నారు. అడవిలో కార్చిచ్చుతో రూ.70 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు- తెలుస్తోంది. గాలిమరలకు మంటలు వ్యాపించడంతో తిరుమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి మరలతో ఏడాదికి 140 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మంటలను తాళలేక వన్యప్రాణులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు శేషాచలం అడువుల్లో చెలరేగిన మంటలపై టీ-టీ-డీ అధికారులు స్పందించారు. మంటల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో అడవి దగ్గమైందని, ఆగమ సలహాదారులను సంప్రదించిన తర్వాత హెలీకాప్టర్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. అడవి దగ్ధమవుతుండటంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఈవో గోపాల్ ఆదేశించారు. మరోవైపు కడప వైపు మంటలు వ్యాపిస్తున్నాయని సమాచారం. స్వామివారి నిలయమైన శేషాచల కొండలు అగ్గిపాలవుతున్నాయి. వారం రోజుల కింద మంటలు లేవగా పట్టించుకోకపోవడంతో సప్తగిరులన్నింటికీ క్రమంగా వ్యాపిస్తున్నాయి. తిరుపతి సవిూపంలోని కరకంబాడి వద్ద వారం రోజుల క్రితం చిన్నపాటి మంటలు లేచాయి. ఆ సమయంలో మంటలను ఆర్పిఉంటే భారీ నష్టాన్ని అరికట్టే అవకాశం ఉండేది. మంటలను ఆర్పకపోవడంతో కరకంబాడి నుంచి క్రమంగా తిరుమల సమీపం వరకు వ్యాపించాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు బూడిదయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి శ్రీగంధం మొక్కల పెంపకాన్ని పాపవినాశనం తీర్థం మార్గంలో తితిదే చేపట్టింది. ఈ ప్రాంతం వరకు మంటలు రావడంతో తితిదే స్పందించింది. తిరుపతి, తిరుమల నుంచి 4అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సమీపంలోని కాకులకోనలో ఉన్న పవన విద్యుత్ కేంద్రాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. అయినా మంటలు ఈ కేంద్రాన్ని దగ్దం చేశాయంటున్నారు. దీంతో తిరుమల విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి. మరోవైపు మంటలు క్రమంగా కడప జిల్లా వైపు వ్యాపిస్తున్నాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో మొక్కలు, వృక్షాలు, జంతువులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ పరిస్థితితో సప్తగిరులన్నీ కాలిపోయే ప్రమాదం ఏర్పడింది. అటవీశాఖ నిర్లక్ష్యం, తితిదే బాధ్యత వహించకపోవడంతో ప్రమాదం, నష్టం తీవ్రరూపం దాల్చింది. మంటలను ఆర్పే ప్రయత్నాలను తితిదే ఈవో గోపాల్, సీవీఎస్వో శ్రీనివాస్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి పరిశీలించారు. గత ఏడాది అగ్నిప్రమాదంతో అటవీసంపదకు నష్టం సంభవించినా అధికారులు గుణపాఠం నేర్చుకోకపోవడం శోచనీయం
శేషాచల అడవుల్లో ఆరని మంటలు





