నేడే మున్సి’పోల్స్’ : రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 29 (జనంసాక్షి) : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 నగరపాలక సంస్థలు, 146 పురపాలక సంఘాల్లో ఆదివారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. బుద్ధభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. కొన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నా మని రమాకాంత్‌రెడ్డి తెలిపారు.ఎన్నికల బందోబస్తుకు 16 కంపెనీల కేంద్ర బలగా లు కేటాయించామని, శాంతిభద్రతలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని కమిషనర్ కోరారు. మున్సిపల్ ఫలితాల వాయిదాపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రమాకాం త్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు వాయిదాపై ఏప్రిల్ 1వ తేదీన హైకోర్టు నిర్ణయం వెల్లడ ిస్తుందని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారంమే తాము వ్యవహరిస్తామని రమాకాంత్‌రెడ్డి ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకూ పోలింగ్ జరుగుతుందని, మున్సిపాల్టీల్లో పదివేలకుపైగా ఈవీఎంల వాడతున్నామన్నారు. కార్పొరేషన్లలో 3814 ఈవీఎంలను, మున్సిపాల్టీల్లో 17వేల మందికి పైగా అభ్యర్థులు, కార్పొరేషన్లనో 3300కుపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. మున్సిపాల్టీల్లో ఓటర్ల సంఖ్య 67 లక్షలు, కార్పొరేషన్లలో 25.47లక్షల ఓటర్లున్నారన్నారు. మున్సిపాల్టీల్లో 6వేలకుపైగా పోలింగ్ స్టేషన్లు, 3వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందినే మున్సిపాల్టీ ఎన్నికలకు వినియోగించ నున్నామ న్నారు. అదనంగా 45 మంది డీఎస్పీలు, 50 మందికిపైగా ఇన్స్పెక్టర్లు, ఏపీఎస్పీకి చెందిన 130 ప్లటూన్ల సిబ్బంది, 16 కంపెనీల కేంద్ర బలగాలు వినియోగించనున్నట్టు రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. మే 7 తర్వాత ఓట్లు లెక్కించాలని నిర్ణయించామన్నారు. బందోబస్తుకు జిల్లాల పోలీసులతో పాటు అదనంగా 41 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలను వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగా 23519 కేసులు నమోదు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడించే తేదీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల తేది మార్పును సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
పుర సమరానికి సర్వం సిద్ధం





