బాబు కలవడం తప్పే : నారాయణ
తిరుపతి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
తమ పార్టీ కాంగ్రెస్‌తో ఎన్నికల సర్దుబాటు మాత్రమే చేసుకుంటోందని, ఇది పొత్తు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అ న్నారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరి స్తితుల్లో మాత్రమే కాంగ్రెస్‌తో తాము కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని నారాయణ అన్నా రు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. బీజ ేపీతో టీడీపీ కలిస్తే సర్వనాశనమేనని అన్నారు. బీజేపీ
ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రక్త పిపాసి అని మండిపడ్డారు. గుజరాత్‌లో నరమేధం సృష్టించిన రక్త పిపాసి అన్నారు. సినీనటులు పవన్, నాగార్జున బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీనీ కలవడంపై నారాయణ స్పందిస్తూ.. చేగువేరాకు మోడీకి తేడాను పవన్ తెలుసుకోవాలన్నారు. ఇక నాగార్జున తన భూములను కాపాడుకోవడం కోసమే మోడీని కలిశాడన్నారు. టీడీపీ అధ్యక్షుడు కేవలం అధికారం కోసమే మోడీతో భేటీ అయ్యారని తెలిపారు. తిరుపతిలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్-సీపీఐ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై విూడియాకు వివరాలు వెల్లడిస్తూ నల్లగొండ లోక్‌సభ స్థానం అడిగామని, అయితే సీట్ల సర్దుబాటుపై ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం స్థానం ఇస్తానందన్నారు. చట్టసభల్లో మా ప్రాతినిధ్యం పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాం. అవకాశం ఉన్న చోట అభ్యర్థులను నిలబెడతామన్నారు. కాంగ్రెస్‌తో సీట్ల అవగాహనే తప్ప కలసి పోటీ చేసే పరిస్తితి లేదన్నారు. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఉండదన్నారు. గురువారం మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని నారాయణ అన్నారు. తమకు కాంగ్రెస్ కేటాయించిన స్థానాలపై గురువారం పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను తాము రెండు ఎంపీ, 17 ఎమ్మెల్యే సీట్లు అడిగామన్నారు. వాస్తవానికి తాము నల్గొండ కోరితే కాంగ్రెస్ ఖమ్మం లోక్‌సభ సీటు కేటాయించిందని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు నారాయణ వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీపై పొత్తుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చట్ట సభల్లో సీపీఐ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ఇప్పటికీ సెక్యూలర్ వ్యతిరేక పార్టీయే అని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నాశనం అవడం ఖాయమని నారాయణ హెచ్చరించారు. మోడీ రక్తపిపాసని అన్నారు. ఈ విషయంలో తమ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. మోదీని పవన్ కల్యాణ్ కలవడం పొరపాటని చేగువేరా బతికివున్నట్లైతే చచ్చిపోయేవారని వ్యాఖ్యానించారు. భూములను కాపాడు కోవడం కోసమే మోదీని నాగార్జున కలిశారని నారాయణ ఆరోపించారు. ఇన్నాళ్లుగా సినిమాల్లో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోడానికే పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించారు. పవన్‌కల్యాణ్ పార్టీ గాలికి కొట్టుకుపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం విలువలు లేవని, మతతత్వ బీజేపీతో ఆయన చేతులు కలపడం సిగ్గు చేటని నారాయణ ఈ సందర్భంగా అన్నారు. ఇదిలావుంటే సీపీఐ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. సీపీఐకి ఒక లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పోటీ దాదాపు ఖరారైంది. ఖమ్మం లోక్‌సభతో పాటు కొత్తగూడెం, పినపాక, వైరా, మునుగోడు, దేవరకొండ, బెల్లంపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, మహేశ్వరం, బహదూర్‌పురా స్థానాలు సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
మావి పొత్తులు కాదు.. సర్దుబాట్లే





