కేంద్రానికి సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ సూచన
జనంసాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాజ్యంగం సంక్షోభాన్ని తొలగించాలంటే అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్రానికి సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ సూచించారు. అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను కొనసాగొంచాలని పరాశరన్ సిఫార్సు చేశారు. రాష్ట్రపతి పాలన పొగింపునకు పార్లమెంట్ సమావేశాలు అవసరం లేదని పరాశవన్ వివరించారు. రాష్ట్రంలో సంక్షోభం ఏర్పాడే అవకాశం ఉందంటూ గవర్నర్ నరసింహన్ వారం క్రితం రాష్ట్రపతికి ఓ నివేదిక అందజేశారు. రాష్ట్రపతి పాలనకు ఈ నెల 31వ తేదీ వరకూ సమయం పూర్తవనున్న క్రమంలో పార్లమెంటు ఉభయ సభలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో గవర్నర్ పేర్కోన్నారు. దీంతో కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు ఈ లేఖను రాష్ట్రపతి పంపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై న్యాయనిపుణుల సలహాను కేంద్రం కోరగా సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రధాని మన్మోహన్‌కు సైతం పరాశరన్ తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. రాజ్యంగం సంక్షోభాన్ని తొలగించాలంటే అసెంబ్లీని రద్దు చేసి , రాష్ట్రపతి పాలనను కొనసాగించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై గవర్నర్ నరసింహన్ అభిప్రాయం తెలుసుకున్న అనంతరం వచ్చే గురువారం అసెంబ్లీని రద్దు చేసి, మరో రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.




