సంగారెడ్డి, ఏప్రిల్ 5 : మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కార్లుర దాఖలు చేసిన అఫిడవిట్లలో రాస్తుల వివరాలు సరిగా లేవని, ఈనెల 9వ తేదీలోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్, జహీరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శరత్ వీరిరువురికి నోటీసులు జారీచేశారు.
కార్మికులకు జీతంతో కూడిన సెలవులు..
జిల్లాలో ఈనెల 6, 11 తేదీలలో జరిగే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సమయంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును చట్టప్రకారం మంజూరు చేయాలని జిల్లా కార్మిక ఉపకమిషనర్ ఆదేశాలు జారీచేశారు.




