Tuesday, 3 November 2026

తొలి దశ ప్రాశాంతం

వెల్లివిరిసిన ఓటర్ల చైతన్యం
80 శాతం పోలింగ్‌
మూడు చోట్ల రీపోలింగ్‌ : రమాకాంత్‌
జరగనున్న విషయం విదితమే.
పరిషత్‌ తొలివిడత ‘పంచాయతీ’ ఇలా..
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు తొలివిడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మొత్తం 557 జెడ్పీటీసీ స్థానాలు 8250 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ పూర్తయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పోలింగ్‌ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఎండల వల్ల మధ్యాహ్న సమయంలో మందకొడిగానే కొనసాగింది. విశాఖజిల్లాలో పోలింగ్‌ మందకొడిగా కొన సాగింది. 80శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యే అవకా శం ఉంది. ప్రకాశం జిల్లాలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికే 80శాతం నమోదైంది. నెల్లూరు, మెదక్‌, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 11న రీపోలింగ్‌ జరగనుంది. మెదక్‌ జిల్లా చర్లగూడెంలోనూ రీపోలింగ్‌ జరగనుంది. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం మం డలం ఉడుగోళంలో రీ పోలింగ్‌ జరగనుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోవూరు-1 పరిధిలో రీ పోలింగ్‌ జరగ నుంది. 5 గంటలకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేం దుకు వెసలుబాటు కల్పించామని రమాకాంత్‌రెడ్డి తెలి పారు. బ్యాలెట్‌ బాక్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచనున్నట్టు తెలిపారు. అంతేగాక స్ట్రాంగ్‌ రూముల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశా మని తెలిపారు. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తర్వాత జరగనున్న విషయం తెలిసిందే. రెండో విడత పరిషత్తు సమరం ఈ నెల 11నపరిషత్‌ తొలివిడత ‘పంచాయతీ’ ముగిసింది.  557 జెడ్పీటీసీ స్థానాలు 8250 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. ఆదివారం సాయంత్రం 5గంటలకు పూర్తయింది. పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరి ఉండడంతో మరో గంటపాటు వారికి అవకాశం కల్పించారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో వృద్ధులు, మహిళలు సైతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు కొట్టారన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ మండలం శేషంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జయన్న అనే ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నాడు. ఓటర్ల జాబితాలో జయన్న పేరు లేదు. తన పేరు ఎందుకు తీసేశారంటూ పోలింగ్‌ సిబ్బందిని నిలదీశాడు. వాగ్వాదం పెరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని జయన్నను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటి పోతుండడంతో అతనిని చితకబాదారని స్థానికులు తెలిపారు. అనంతరం ఇంటికి వెళ్లిన జయన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *