Tuesday, 3 November 2026

రాత్రికి రాత్రే ఏం జ‌రిగిందో

టీఆర్ఎస్ టికెట్ జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు టీఆర్ఎస్ విడుదల

(జ‌నంసాక్షి ): కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలి అన్నుకున్నారు.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి,తనకు టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన రామ్మోహన్ గౌడ్,స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు.

సరిగ్గా ఇక్కడే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తన అనుచరుడికి ఎలాగైనా ఆ టికెట్ ఇప్పించాలని చక్రం తిప్పారు. టీఆర్ఎస్‑లో తనకున్న పరిచయాలతో తెల్లవారేసరికల్లా రామ్మోహన్ గౌడ్ పేరు టీఆర్ఎస్ విడుదల చేసిన రెండో జాబితాలో కనిపించింది. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్‑లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *