హైదరాబాద్: టీడీపీ నేత, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. మైనంపల్లికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరో నలుగురు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.




