Tuesday, 3 November 2026

తెలంగాణ‌ లో నేడు నామినేషన్ల గడువు పూర్తి

(జ‌నంసాక్షి):తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసేందుకు గడువు నేటితో ముగియనునుండడంతో అన్ని పార్టీల హేమాహేమీలు నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నాడు నామినేషన్‌ వేయాల్సి ఉండడంతో రాజకీయ పార్టీలు తమ నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా మంగళవారం రాత్రి 11.00 గంటలకు అభ్యర్థు లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయు డు చివరి కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించారు.

హేమా హేమీల నామినేషన్‌ నేడే!
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేందుకు చివరి తేదీ కావడంతో బుధవారం నాడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. మంగళవారం నాడే నామినేషన్‌ వేద్దామని భావించిన వారు కూడా బుధవారానికి వాయిదా వేసుకు న్నారు. నిన్న మంగళవారం నాడు శ్రీరామ నవమి కావడం తో పార్టీల శ్రేణులు, కార్యకర్తలు నామినేషన్ల సందడిలో పాల్గొంటారో లేదో నని బుధవారానికి వాయిదా వేసుకున ్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు ముహుర్తం కూడా మంచిగా ఉండడంతో అభ్యర్థులు తమ నామినేష్లను అట్ట హాసంగా దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసు కుంటున్నారు. రెండు మూడు రోజులుగా నామినేషన్‌ దాఖలుపైనే అభ్యర్థులు కసరత్తు చేశారంటున్నారు. నామినేషన్‌ పత్రాలుదాఖ లు చేసేటప్పుడు తీసుకోవా ల్సిన జాగ్రత్తలు తీసుకుం టూనే ఆదాయం, అప్పులు తదితర అంశాలను తమ అఫిడవిట్లలో పొందుప ర్చనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *